Pusthakavani

Novel

In stock

Advaitha Premakavyam

By Vamsi Krishna

₹325.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

ఈ పుస్తకాన్ని నేను రాస్తాననుకోలేదు. రాయాల్సి వచ్చింది. ఇందులో అన్ని రకాల అంశాల గురించి క్లుప్తంగా - మర్మంగా వివరించే ప్రయత్నం చేశాను. ఆ వివరణ అసంపూర్ణంగా కూడా అనిపించచ్చు, కానీ కొన్నిసార్లు అసంపూర్ణతలోనే పరిపూర్ణత దాగి ఉంటుంది. అది సూక్ష్మదృష్టితో చూస్తే తప్ప అర్థంకాదు. ఈ పుస్తకం ద్వారా ఆ పూర్ణదృష్టిని పెంపొందించే ప్రయత్నం చేశాను. ఈ కవితలలో ఉన్న విరహాన్ని- భావాన్ని ఎవరు ఎలా అయినా అర్థంచేసుకోవచ్చు. కానీ, ఈ కవితలలో ఉద్దేశ్యం మాత్రం- స్త్రీ అయినా పురుషుడైనా వారు దేహ సంబంధిత గుర్తింపులు కాదు, మొదట వారు చైతన్యం అను విషయాన్ని గుర్తుచేయటానికే. ఆ విషయాన్ని మరిచిన వారి అస్తిత్వం, మరలా ఆ స్థితిని చేరుకోవటానికి కలవరించే కలతలే ఈ కవితలు. ఇందులోని కథలలో ఉన్న ప్రశ్నలు - విమర్శలు, జవాబులు - సమాధానాలు అన్నీ కూడా నా సత్సంగాల్లోని ప్రజల అయోమయాల నుంచి జన్మించిన అంశాలు. ప్రజల్లోని ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా సామాజిక విప్లవాన్ని తీసుకురావాలన్న సంకల్పంతో చేస్తున్న ఈ యుద్ధంలో, నాకు ఎదురైన పరిస్థితులకు ప్రతిబింబాలు ఈ కథలు. ఏదో సాదాసీదాగా కాలక్షేపం కోసం జీవితం గురించి - దైవం గురించి రాసిన రాతలు కావు ఇవి. ప్రజల్లో పేరుకుపోయిన అజ్ఞాన సామ్రాజ్యాన్ని పునాదులతో సహా బద్దలు చేయటానికి కంకణం కట్టుకున్న నా జీవిత ఆశయం ఈ పుస్తకం. ప్రజల్లోని జ్ఞానజ్యోతిని వెలికితీయాలని మొదలైన ప్రజా జీవితంలో ఒక అధ్యాయమే ఈ ‘అద్వైత ప్రేమకావ్యం’. -వంశీకృష్ణ

Format: Physical edition
Language: Telugu
Publisher: Aju
ISBN: 9788196717681
Pages: 313

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all